రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వటంతో… కుటుంబసభ్యులు కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణం రాజు పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు చెబుతున్నారు.
కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ప్రభాస్ కూడా ఆస్పత్రిలో కృష్ణంరాజును పరామర్శించి, డాక్టర్లతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.