ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవల పెద్దపల్లి జిల్లా రామగుండం లోని ఓపెన్ కాస్ట్ 2 స్టార్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ పూర్తి అయినట్లు ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీసినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొదటిసారిగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.