యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనాపై యుద్ధం ప్రకటించిన కేంద్రంతోపాటు తెలుగు రాష్ట్రాలకు తన వంతు సాయంగా విరాళం ప్రకటించాడు. కేంద్ర సహాయ నిధికి3 కోట్ల విరాళం ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధులకు ప్రభాస్ 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. బాహుబలితోపాటు సాహో సినిమాతో తనను ఆదరించిన ఉత్తారాది ప్రేక్షకులను కుడా ఆదుకోవాలనే భావనతో ప్రభాస్ ప్రధానమంత్రి సహయనిధికి ఏకంగా 3 కోట్ల విరాళం ప్రకటించడం విశేషం.
కరోనా కట్టడికి కృషి చేస్తోన్న ప్రభుత్వాలకు సినీతారలు విరాళం ప్రకటించడం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించి తమ హీరోయిజాన్ని ప్రూవ్ చేసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ విరాళం ప్రకటించగా… తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే ఇంత భారీగా విరాళం అందించిన హీరో ఎవరూ లేరు.