గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ సడన్ గా మృతిచెందడంతో కన్నడనాట ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షాక్ కు గురైంది. కన్నడ ఇండస్ట్రీతో పాటు సౌత్ నుంచి చాలా మంది స్టార్స్ పునీత్ ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు.
అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పునీత్ ను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మేము జేమ్స్ రూపంలో ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నామని అనుకుంటున్నాను. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సార్ ని అభిమానించే లక్షలాదిమందికి ఈ చిత్రం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది.
మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాము అంటూ ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టారు. ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమా మార్చి 17న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా పునీత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.