దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు ప్రభాస్ రేంజ్ ను పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ ప్రభాస్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ చిత్రం తాలూకు టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్, లవ్ స్టోరీ, కోబ్రా వంటి చిత్రాలకు సంబంధించి టీజర్ లపై క్లారిటీ వచ్చింది. రాధేశ్యామ్ సినిమా టీజర్ అప్డేట్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి రాధేశ్యామ్ టీజర్ వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి చిత్రయూనిట్ వారి కోరిక తెరుస్తుందో లేదో చూడాలి.