మహబూబ్‌నగర్ : తమ డార్లింగ్ మూవీ చూడాలని వెళ్తే.. బెనిఫిట్ షో క్యాన్సిల్ చేశామంటే మండదా మరి..? ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ హర్టయ్యారు. దొరికింది దొరికినట్టు కుర్చీలు ఇరగొట్టి విసిరేశారు. ధియెటర్ ధ్వంసం చేశారు. ఎక్కడో సినిమా జనం వేలంవెర్రిగా వుండే గోదావరి జిల్లాల్లో ఇది జరిగిందనుకుంటే ఆశ్చర్యం ఏదీ లేదు. వెనకబడిన పాలమూరు జిల్లాలో జరిగిందిది. తమ వెండితెర బాహుబలిని.. చూడకచూడక రెండేళ్ల తరువాత చూద్దామని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటే మొదటి ఆటే రద్దు చేశామనడంతో పట్టలేని ఆగ్రహంతో ఫాన్స్ ఊగిపోయి ఈ విధ్వంసం సృష్టించారు. ఒళ్లుమండి సహనం కోల్పోయి… కుర్చీలన్నీ గాల్లోకి ఎగరేసి బీభత్సం సృష్టించారు. దేవరకద్రలో జరిగిన ఈ ఘటనతో తెలంగాణా జిల్లాల్లో కూడా డార్లింగ్‌కు వీర ఫాన్స్ ఉన్నారని అందరికీ అర్ధమైంది.