ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూ.వి క్రియేషన్స్ ,గోపి కృష్ణ మూవీస్ పథకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
అయితే ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ కు ప్రభాస్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడట. సినిమా కోసం పని చేస్తున్న వారందరికీ చేతి వాచ్ లు ఇచ్చాడట. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ ఈ సినిమా తో పాటు ఓం రౌత్ దర్శకత్వం లో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.