వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఒప్పుకుంటూ… ఫాస్ట్ ఫేజ్ లో సినిమాలను పూర్తి చేస్తున్న హీరో ప్రభాస్. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ సెట్ల మధ్య చక్కర్లు కొడుతున్న ఈ హీరో, మరో పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చాలా కాలం క్రితమే… టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు భారీ అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ సరైన కథ, దర్శకుడు దొరక్కపోవటంతో ఆ ప్రాజెక్టు అలాగే ఉండిపోయింది.
ఇటు దిల్ రాజు కూడా చాలాకాలంగా పాన్ ఇండియా సినిమా తీయాలన్న కోరికతో ఉన్నాడు. దీంతో ప్రభాస్ తోనే ఆ ముచ్చట తీర్చుకునేందుకు దిల్ రాజు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
దిల్ రాజు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఈ సినిమా చేయనున్నాడు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తుండగా, మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయి ఉన్నాడు. దీంతో ఆ సినిమాలన్నీ పూర్తైన తర్వాతే ప్రభాస్- ప్రశాంత్ నీల్ సెకండ్ మూవీ పట్టాలెక్కనుంది. ప్రశాంత్ నీల్ పనితనం పట్ల ఇంప్రెస్ అయిన ప్రభాస్… మరోసారి ఛాన్స్ ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. 2023లో ఈ సినిమా పట్టాలెక్కనుండగా… ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ అడ్వాన్స్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్.