యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక లో 28 మంది ప్రభాస్ ఫ్యాన్స్ గాయ పడ్డారు. కాగా వారికి చికిత్స కోసం ప్రభాస్ సహాయం చేశారట. ఇదే విషయమై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.