ప్రభాస్ మొదటిసారిగా బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. డైరెక్టర్ ఓం రావత్ చెప్పిన స్క్రిప్ట్ తో ప్రభాస్ ఫుల్ గా కన్విన్స్ అయ్యాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎక్కువ టైం గ్రాఫిక్స్ తీసుకోనుంది. సినిమా షూట్ అంతా ముంబైలోని ఓ ప్రైవేటు స్టూడియోలోని గ్రీన్ మ్యాట్ లో చేయనున్నారు. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్ 60రోజుల నాన్ స్టాప్ టైం ఇచ్చినట్లు తెలుస్తోంది. 2021 మొదట్లో సినిమా షూటింగ్ మొదలు కానుండగా… ప్రభాస్ ఆది పురుష్ ను పూర్తి చేసుకొని, ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోయే మరో భారీ బడ్జెట్ మూవీ టీంతో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా… సీత పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇంకా తేలలేదు. సీత పాత్రపై రోజుకో పేరు తెరపైకి వస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా, టీ సిరీస్ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్, షూటింగ్ పూర్తి కాగానే విల్లు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు.