యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్, అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇంస్టాగ్రామ్ లో 7 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.
రెండేళ్ల క్రితం ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టారు ప్రభాస్.అతి తక్కువ సమయంలోనే 7 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.