పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆహాలో కనిపించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్‌లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. దీంతో ప్రభాస్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇటు నందమూరి బాలకృష్ణ అటు ప్రభాస్, గోపీచంద్‌ల ఫ్యాన్స్ పర్‌ఫెక్ట్ విందు భోజనంలాంటి ఎపిసోడ్‌ను ఆహా సిద్ధం చేసింది. ఇంత గొప్ప ఎపిసోడ్ ను ఎడిట్ చేయటానికి చాలా కష్టపడుతోంది యూనిట్. ఎందుకంటే ఇందులో ప్రతి క్షణం ఎంతో విలువైనదే. దాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదించాలి. దీంతో ఆహా.. ఈ బాహుబలి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకుంది.
అవును.. 100 నిమిషాల బాహుబలి ఎపిసోడ్‌ని రెండు భాగాలు చేశారు. ఒక భాగాన్ని డిసెంబర్ 30న కొత్త సంవత్సరాది ట్రీట్‌గా ప్రసారం చేస్తారు. అలాగే రెండో భాగాన్ని జనవరి 6న స్ట్రీమింగ్ చేస్తారు.
డిసెంబర్ 30న ప్రసారం కాబోయే తొలి ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ మధ్య జరిగే సంభాషణ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. ఇది ఆహాలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా కొత్త సంవత్సరం ట్రీట్‌గా రానుంది. ఇక డిసెంబర్ 6న ప్రసారం కాబోయే రెండో ఎపిసోడ్‌లో ప్రభాస్, ఆయన బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్, నందమూరి బాలకృష్ణ మధ్య ఆసక్తికరంగా సాగనుంది. ఇందులో ప్రభాస్, గోపీచంద్ కెరీర్ ఇండస్ట్రీలో ఎలా ప్రారంభమైంది. వారి స్నేహం ఎలా ప్రారంభమైంది..ఇన్నేళ్లలో ఎలా బలపడింది అనే విషయాలుంటాయి.