అనుష్క ఎక్కువగా వార్తల్లో నిలువడానికి ప్రభాస్ తో ఆమెకున్న సాన్నిహిత్యమే కారణమని చెప్పొచ్చు. అయితే వారి మధ్యనున్న స్నేహాన్ని చాలామంది రకరకాలుగా ప్రచారం చేశారు. అనుష్క ప్రభాస్ ల మధ్య లవ్ ఎఫైర్ ఉందని చాలాకాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అనుష్క, ప్రభాస్ లు ఖండిస్తూ తమ మధ్యనున్నది స్నేహమేనని క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు అనుష్క అంటే తమ వదిన అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తుంటారు. ప్రభాస్ కూడా ఈ విషయమై పలు సందర్భాల్లో స్పందించాడు. అనుష్క, తన మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని స్పష్టం చేస్తూనే వస్తున్నాడు. ఇక ఇటీవల అనుష్క మాట్లాడుతూ.. తాము ఎంత మంచి స్నేహితులమో చెప్పేందుకు ఓ విషయాన్నీ ఊదాహరించింది. తాను అవసరమైతే రాత్రి 3గంటల సమయంలో కూడా ప్రభాస్ కు ఫోన్ చేస్తానని.. తమ మధ్య అంత చనువు ఉందని తెలిపింది.
ఇటీవల జరిగిన ఓ షోలో అనుష్క యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఫోటో సుమ చూపించగానే నా కొడుకు అంటూ సమాధానమిచ్చింది. అదేంటి అని సుమ అడగ్గా.. అవును నా కొడుకే కదా అంటూ మరోసారి స్పష్టం చేసింది. మీ ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయని సుమ అనగానే కౌంటర్ గా అందుకే.. ప్రభాస్ నా కొడుకు అంటూ పంచ్ విసిరింది అనుషాక్. సరే.. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పండని సుమ కోరగా.. అందుకే కదా ప్రభాస్ నా కొడుకు అయ్యాడంటూ మరో సెటైర్ వేసింది అనుష్క.