ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ అయింది. శనివారం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
మొన్నటి వరకు ఆది పురుష్ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న ప్రభాస్ అది పూర్తి చేసి సలార్ షూట్ లో జాయిన్ అయ్యారు. ఒక వారం పాటు రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చేయనున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ సంబంధించి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఇక ఏప్రిల్ 14న వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.