మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయాల్సిన సినిమా ఆగిపోయిందంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాకముందే, ప్రాజెక్టు కాన్సిల్ అయిందంటూ ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోలేదు. కచ్చితంగా వచ్చి తీరుతుందని అంటున్నాయి ఇరువర్గాలు.
డీవీవీ దానయ్య బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుంది. లెక్కప్రకారం ఈపాటికి మూవీ ఓపెన్ అవ్వాలి. కానీ అలా జరగలేదు. అందుకే వదంతులు వ్యాపించాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా ఓపెనింగ్ ఉంటుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
సలార్ షెడ్యూల్స్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇప్పుడా షెడ్యూల్స్ పై క్లారిటీ వచ్చింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఆగస్ట్ చివరి నాటికి సలార్ సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం కంప్లీట్ అయిపోతుందట. సో.. అప్పుడు మారుతి సినిమాకు లైన్ క్లియర్ అవుతుందన్నమాట.
సెప్టెంబర్ నుంచి మారుతి సినిమాతో పాటు ప్రాజెక్ట్-కె ను కంటిన్యూ చేయబోతున్నాడు ప్రభాస్. మారుతి సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను తీసుకున్నారు. తమన్ సంగీతం అందించబోతున్నాడు.