ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇలాంటి టైమ్ లో అతడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగలడా? రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయగలడా? ఎవరికైనా దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. కానీ, ప్రభాస్ మాత్రం కొత్త సినిమా స్టార్ట్ చేయడానికే మొగ్గుచూపుతున్నాడు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే ప్రభాస్ కొత్త చిత్రం స్టార్ట్ అవుతుంది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా, ప్రారంభమై, ఇదే నెలలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. ఓ 4-5 రోజులు ఈ సినిమాకు ప్రభాస్ కాల్షీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.
ప్రభాస్-మారుతి కాంబోను పీపుల్ మీడియా బ్యానర్ లాక్ చేసింది. ఇంతకుముందు డీవీవీ దానయ్య పేరు వినిపించినప్పటికీ, పీపుల్ మీడియా బ్యానర్ పై, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా వస్తోంది. మరో 2 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ పై స్పష్టత వస్తుంది.
ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మరోవైపు ప్రాజెక్టు-కె సెట్స్ పై ఉంది. త్వరలోనే స్పిరిట్ మూవీని కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇలాంటి టైమ్ లో మారుతి సినిమాకు ప్రభాస్ కాల్షీట్లు కేటాయించడం ఆశ్చర్యకరమైన విషయమే.