యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచాడు ప్రశాంత్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఈ సినిమా కోసం ఇండియాలో ఇంతకముందెన్నడు లేని విధంగా హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీ వాడుతున్నారట.
ఇదే నిజమైతే భారతీయ సినీ ప్రియులకు సరికొత్త సినిమాటిక్ అనుభవాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు సినీ ప్రముఖులు. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తుండగా…. 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.