కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్- ప్రభాస్ మధ్య సినిమా ఉంటుందన్న ఊహాగానాలకు తెరదించుతూ ఏకంగా టైటిల్ కూడా రిలీజ్ చేశారు కేజీఎఫ్ నిర్మాతలు. సలార్ టైటిల్ గా సినిమా రాబోతుందని ప్రకటించినా… ఇంతకు సలార్ అంటే అర్థం ఏంటో చాలా మందికకి అర్థం కాలేదు. దీనిపై మీడియాలో, గాసిప్ పోర్టల్స్ లో చాలా ప్రచారం జరిగింది.
చివరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్వయంగా సలార్ అర్థం చెప్పాడు. సలార్ అంటే అత్యంత నమ్మదగిన వ్యక్తి అని. ఓ రకంగా రైట్ హ్యాండ్ అని అర్థం. అంటే ఓ రోజుకు ప్రభాస్ నమ్మదగిన వ్యక్తిగా… మేజర్ జనరల్ గా ఉండబోతున్నట్లు అంచనా వేయవచ్చు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా షూట్ వచ్చే ఏడాది జనవరి నుండి మొదలయ్యే అవకాశం ఉంది.
డిసెంబర్ చివరి కల్లా ప్రభాస్ తన రాధేశ్యామ్ మూవీ షూట్ ను పూర్తి చేయబోతున్నాడు.