కండలు తిరిగిన దేహంతో బాహుబలి సినిమా తీసి వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన హీరో ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఇటలీలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దానితో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయబోతున్నాడు.
ఇటువంటి సమయంలో ప్రభాస్ లుక్ ఒకటి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారీ కటౌట్ తో కనిపించే ప్రభాస్ ఒక్కసారిగా సన్నబడిపోయాడు. ఫిట్ గా కనిపిస్తున్నప్పటికీ ప్రభాస్ ఒక్కసారిగా సన్నగా కనిపించడంతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ప్రభాస్ లుక్ కొత్త సినిమాల కోసమే అంటూ అభిమానులు నెటిజన్లు చర్చలు కూడా మొదలు పెట్టేశారు.