జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే బాహుబలి, సాహో సినిమాలతో తన క్రేజ్ ఏంటో చెప్పకనే చెప్పాడు. ఈ సినిమా ద్వారా మరోసారి హిట్ కొట్టేసి తాను ఇండియన్ హీరో అని ప్రూవ్ చేసుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా పూర్తి కాగానే ప్రభాస్ ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళతారని చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొరటాల శివ కథను చెప్పగా.. ప్రభాస్ ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేస్తున్నందున ఆ సినిమా పూర్తి కాగానే ప్రభాస్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళతారని తెలుస్తోంది.
వరుస హిట్లతో.. అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. దీంతో ప్రభాస్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.