యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ సినిమా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఎందులో ప్రభాస్ దొంగగా, లవర్ బాయ్ డబల్ రోల్ లో కనిపించనున్నాడు. పునర్జన్మలతో కూడిన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ అని మొదట అనుకున్నారు. కానీ మరో రెండు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ కొత్త సినిమాకు ఓ డియర్, రాదే శ్యామ్ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రెండిటిలో ఓ డియర్ పై ప్రభాస్ తో పాటు దర్శక, నిర్మాతలు కూడా మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. కానీ అధికారికంగా ఇప్పటి వరకు టైటిల్ ను ప్రకటించలేదు. ఉగాది కానుకగా మార్చ్ 25 న టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.
బాహుబలి, సాహూ లాంటి సినిమా తరువాత ప్రభాస్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.