
కేజీఎఫ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో మోత మోగించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అదే జోష్ తో ఇప్పుడు కేజీఎఫ్ పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కథ కూడా ఎన్టీఆర్ కు చెప్పాడని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సీన్ లోకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అయ్యాడు. కేజీఎఫ్ నిర్మాణ సంస్థకు ప్రశాంత్ నీల్ ఓ సినిమా చెయ్యాల్సి ఉందట. ఈ నేపద్యంలొనే ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో సినిమా చెయ్యనున్నదట. అయితే ఎన్టీఆర్ సినిమా తరువాత ఈ సినిమాను తీస్తాడా లేక ముందే తీస్తాడా అనేది క్లారిటీ లేదు. కాగా ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.