ఎంత పెద్ద హీరో అయినా సంక్రాంతికి గ్యాప్ తీసుకోవాల్సిందే. మహేష్ బాబు అయితే ఆ గ్యాప్ లో కూడా విదేశాలకు వెళ్లిపోవాలని చూస్తాడు. కానీ ప్రభాస్ మాత్రం సంక్రాంతిని కూడా లెక్క చేయడం లేదు. రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.
అవును.. గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్, సంక్రాంతికి కూడా బ్రేక్ తీసుకోవడం లేదు. 8వ తేదీ నుంచి సలార్ సినిమాకు డేట్స్ ఇచ్చాడు ఈ పాన్ ఇండియా స్టార్.
8 నుంచి సలార్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. దాదాపు ఈ నెలంతా కొనసాగే భారీ షెడ్యూల్ ఇది. ఇందులో ప్రభాస్ పాల్గొంటాడు. యూనిట్ కోసం సంక్రాంతి ఒక్క రోజు మాత్రం హాలిడే ప్రకటించారు.
ప్రభాస్ కు ఇప్పుడు టైమ్ చాలా తక్కువగా ఉంది. చేతిలో సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. వీలైనంత తొందరగా వాటిని పూర్తిచేయాలి. ఏ సినిమా లేట్ అయినా సమస్యలొస్తాయి. అందుకే రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు ప్రభాస్.
ఆదిపురుష్ షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్-కె సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ 3 సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు కేటాయిస్తున్నాడు.