ప్రస్తుతం ప్రభాస్ 3 సినిమాలు చేస్తున్నాడు. అతడు నటిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇక సలార్ సినిమా సెట్స్ పై ఉంది. మరోవైపు ప్రాజెక్ట్-కె షూటింగ్ కూడా నడుస్తోంది. కానీ ఈ 3 సినిమాలు ఒకేసారి విడుదల కావడం లేదు. పైగా మనం చెప్పుకోబోయేది ఈ 3 సినిమాల గురించి కూడా కాదు.
ప్రభాస్ నుంచి ఒకేసారి 3 సినిమాలొస్తున్నాయి. అవి అతడి పాత సినిమాలు. వర్షం, రెబల్, బిల్లా సినిమాల్ని ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఇంతకీ ఏంటి విశేషం అనుకుంటున్నారా?
ఈనెలలో ప్రభాస్ పుట్టినరోజు ఉంది. అతడి పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో, అభిమానులు ఇలా ప్రభాస్ నటించిన పాత సినిమాల్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ 3 సినిమాల్ని హిట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజెస్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలకృష్ణకు చెందిన సినిమాలు రీ-రిలీజయ్యాయి. ఇప్పుడు అదే బాటలో ప్రభాస్ నటించిన వర్షం, రెబల్, బిల్లా సినిమాల్ని కూడా ఈనెలలో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు 3 సినిమాల్ని 4కే రిజల్యూషన్ లోకి మార్చే పనులు ఊపందుకున్నాయి. త్వరలోనే ఈ 3 సినిమాల విడుదలకు సంబంధించి థియేటర్స్ లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు.