పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మార్చి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్.
కాగా తాజాగా బుధవారం ఉదయం ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్ . ఈ ఈవెంట్ లో ప్రభాస్ తన పెళ్లిపై స్పందించాడు. నా ప్రేమ అంచనా తప్పిందని అందుకే పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చాడు.
ఇక ట్రైలర్ రిలీజ్ తరువాత మాట్లాడుతూ భారతీయ సినిమా మారుతుందని బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి చిత్రాలు దేశాన్ని ఆకట్టుకున్నాయని ప్రభాస్ అన్నారు.
ఇక రాధే శ్యామ్ ను రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.