అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోగా తెరెక్కుతున్న చిత్రం మహాసముద్రం. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 14 న రిలీజ్‌కి కాబోతుంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఇటీవల విడుదలైన మహా సముద్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. విడుదలైన రెండవ రోజు కూడా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ కు 6.5 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా… తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ట్రైలర్ బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. మహా సముద్రం ట్రైలర్ ఇంటెన్స్ అండ్ ఆసక్తిని కలిగిస్తుంది. శర్వానంద్, సిద్ధార్థ్ తో పాటు చిత్రబృందానికి నా అభినందనలు అన్నారు.