ప్రస్తుతం జాన్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తన నెక్స్ట్ మూవీతో మహేశ్ బాబుకి చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్న మహేశ్, జక్కన్నతో కలిసి 2021లో బాండ్ మూవీ చేయడానికి సిద్దమయ్యాడు. జులై 30న ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి, మహేశ్ బాబుల కాంబినేషన్ లో రానున్న జేమ్స్ బాండ్ స్థాయి సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అయితే మహేశ్ బాబు, రాజమౌళిల ఆలోచనకి చెక్ పెడుతూ, ప్రభాస్ పావులు కదుపుతున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న జాన్ సెట్స్ పై ఉండగానే, తన నెక్స్ట్ సినిమాకి కూడా స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్న ప్రభాస్, అందుకు సైరా సురేందర్ రెడ్డి చెప్పిన లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇప్పటివరకూ కమర్షియల్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి, సైరాతో హై బడ్జట్ సినిమాలని కూడా చెయయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. స్టైలిష్ మేకర్ గా చాలా మంచి పేరున్న సురేందర్ రెడ్డి, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. మన దగ్గర స్పై సినిమాలు చాలానే వచ్చాయి కానీ నేషనల్ వైడ్ కంప్లీట్ జేమ్స్ బాండ్ స్థాయి సినిమాలు మాత్రం రాలేదు. ఈ లోటు తీర్చడానికే ప్రభాస్ అండ్ సురేందర్ రెడ్డి కలిసి బాండ్ సినిమాతో రాబోతున్నారని తెలుస్తోంది. ఈ కలయిక ఎఫెక్ట్ మహేశ్ బాబు సినిమా పడే అవకాశం ఉంది. సురేందర్ రెడ్డి, ప్రభాస్ కలిసి పాన్ ఇండియన్ స్టాండర్డ్స్ తో బ్యాండ్ సినిమా చేస్తే మాత్రం, రాజమౌళి మహేశ్ బాబులు జానర్ అయినా మార్చుకోవాలి లేక కాస్త జాగ్రత్త పడాలి.