నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రొడ్యూసర్ వీ ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. ఈ సినిమాకి మహేష్ దర్శకత్వం వహించారు. ఇందులో సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ అయింది. ఈ ట్రైలర్ ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లర్ గా ఉందని చెప్పాలి.
యాక్టర్ శ్రీకాంత్, భరత్ సహా ఇతర ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ చుట్టూ ఉన్న సీన్స్ గాని యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అదిరే లెవెల్లో అనిపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ లో సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీతం హైలైట్ అని చెప్పాలి. సినిమాలో థ్రిల్ ఫాక్టర్ ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ఎలివేట్ చేసింది.
మరి ఈ చిత్రం ఎలా ట్రీట్ ఇవ్వనుందో తెలియాలంటే ఈ జనవరి 26 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్ లు పలు పాత్రల్లో కనిపించబోతున్నారు.