ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మూవీ రిలీజ్ అవుతున్న అన్ని భాషలను కవర్ చేస్తూ మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాధేశ్యామ్ మూవీ ప్రేమకు, విధికి మధ్య జరిగే యుద్ధం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అయితే.. ఓ రిపోర్టర్ ఆ రెండింటిలో ఏది గెలిచింది అని అడిగాడు. దీంతో ప్రభాస్ కాస్త చమత్కారంగా మాట్లాడుతూ బడ్జెట్ విషయాన్ని రివీల్ చేశాడు.
‘ఈ ప్రశ్నకు ఇప్పుడే జవాబు చెప్పేయమంటారా ఏంటి? కనీసం 50 రూపాయలైనా పెట్టి మా సినిమా చూసి ఆ సంగతి తెలుసుకోండి. మా ప్రొడ్యూసర్లు ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి.. థియేటర్ కు వెళ్లి మూవీ చూడకుండా ఈ విషయం తెలుసుకోవాలంటే ఎలా’ అని అన్నాడు.
ప్రభాస్ వ్యాఖ్యలతో అందరూ పగలబడి నవ్వారు. అయితే.. ఈ ప్రశ్న వేసిన రిపోర్టర్ పుణ్యమా అని.. రాధేశ్యామ్ బడ్జెట్ ఎంతన్నది రివీల్ అయింది. సినిమా ప్రారంభానికి ముందు బడ్జెట్ రూ.200 కోట్లు అని అనుకున్నా.. రూ.300 కోట్లు అయిందని ప్రభాస్ వ్యాఖ్యలతో తేలిపోయింది.