యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ ‘సాహో’ రూ.350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ మూవీ కావడంతో ప్రొడ్యూసర్స్‌కు ఒత్తిడి తప్పలేదు. అందుకే ఫైనాన్షియల్ సపోర్ట్‌గా మెగా ఫ్యామిలీని నిలిచినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ద్వారా రామ్ చరణ్, అల్లు అర్జున్ ‘సాహో’ టీమ్ కోసం చేయూత అందించినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే హీరో ప్రభాస్ ముంబైలో సైరా టీమ్ రామ్ చరణ్, చిరంజీవిలను కలిసి ముచ్ఛటించి వచ్చారని సినీ వర్గాలంటున్నాయి. ‘సాహో’కు అందించిన సహకారానికి బదులుగా మెగా ఫ్యామిలీకి లాభాల్లో కొంత వాటా దక్కవచ్చని అంటున్నారు.
ముంబైలో సైరా టీజర్ ఆవిష్కరణ తరువాత అక్కడ డార్లింగ్ ప్రభాస్ ప్రత్యక్షమై… సైరా బృందానికి శుభాకాంక్షలు తెలపడం ప్రమోషన్ స్ట్రాటజీలో భాగమేనని తెలుస్తోంది. చిరంజీవి, చరణ్‌లతో ప్రభాస్ ఫోటో సెషన్ సెన్సెషన్ అని అనుకున్నారు అందరూ. కానీ.. అందులో వ్యాపార సూత్రం ఇదీ. పైగా, ప్రభాస్, చరణ్ ఇప్పటికే ఫ్రెండ్స్. నాకు నీవు.. నీకు నేను..అన్నట్టుగా ప్రమోషన్ స్ట్రాటజీ ఇది…
అసలే హై బడ్జెట్ సినిమా… ఓపెనింగ్ డేస్ లోనే క్యాష్ చేసుకోవాలి గదా..! అందుకే ‘సాహో’ టిక్కెట్ రేట్లు పెంచటానికి నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఫర్మిషన్ తీసుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మొదట రెండు వారాలు ఈ టిక్కెట్ రేట్లు పెంచుతారంటున్నారు.
‘సాహో’ మానియా ఇండియన్ సినిమా లవర్స్ ను ఊపేస్తోంది. బెనిఫిట్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్లానింగ్ జరుగుతున్నది. థియేటర్లలో ఆగష్టు 29 రాత్రి సాహో స్పెషల్ స్క్రీనింగ్ కనీసం రూ. 500/- నుంచి టికెట్ రేటు ఫిక్స్ చేసి భారీ ఫాన్సీ రేట్లు హైక్లాస్ కు వసూలుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సూపర్ మూవీ సాహో డిటెయిల్స్…
నిర్మాణం: యు.వి.క్రియేషన్స్
దర్శకత్వం: రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్
సెన్సార్: కార్యక్రమాలు పూర్తి- ‘యు/ఎ’ సర్టిఫికేట్
విడుదల: ఆగష్టు 30
నిడివి: 2 గంటల 54 నిమిషాలు
హీరో: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
హీరోయిన్: శ్రద్ధాకపూర్
తారాగణం: జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, అరుణ్ విజయ్ తదితరులు
టెక్నికల్: హాలీవుడ్ సాంకేతిక నిపుణులు
ప్రభాస్: అశోక చక్రవర్తి అనే అండర్ కవర్ కాప్
శ్రద్ధాకపూర్: అమృతానాయర్ అనే పోలీస్ ఆఫీసర్
భాషలు: తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం
స్క్రీన్లు: ప్రపంచవ్యాప్తంగా 10వేల పైనే..
ఈవెంట్: హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అత్యంత భారీగా సాహో ప్రీరిలీజ్ వేడుక
రూ. 3కోట్లతో స్టేజీ … సాహో వరల్డ్ డిస్ ప్లే