సాహో రిలీజ్‌కు ముందు ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయ్. రిలీజ్ తర్వాత డివైడ్ టాక్‌తో చిత్ర యూనిట్‌తో పాటు ఇండస్ట్రీ కూడా నీరుగారిపోయింది. రివ్యూల్లో ప్రభాస్‌ని అందరూ మామూలుగా ఆడిపోసుకోలేదు. నెటిజన్లు ఒక రోజంతా దీనికే కేటాయించారు. ఓవరాల్‌గా సాహో అందర్నీ బాగా నిరాశ పరచిందని వీరంతా తేల్చేశారు. కానీ కలెక్షన్స్ మాత్రం ప్రాజెక్ట్ సేఫ్ అనేట్టుగా ఉండటమే ఆశ్చర్యం.
ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఫాన్స్‌ను సంతృప్తి పరచాయని అనుకోవాలి. అందుకే రెండు రోజుల్లో టోటల్‌గా 205 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది ట్రేడ్ రిపోర్ట్. ఇదే ట్రెండ్ కొనసాగితే ఫస్ట్ వీక్‌లోనే ప్రాజెక్ట్ సేఫ్ కావచ్చన్న అంచనాలు వస్తున్నాయి.
తొలిరోజే మిలియన్ క్లబ్‌లో చేరింది ఈ మూవీ. ప్రభాస్ తన మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డుని తానే బ్రేక్ చేయడం అతని ఫాన్స్‌కు ఖుషీ కలిగే అంశం.
వరుస సెలవులు, వినాయక చవితి పండగ ‘సాహో’ ఎలావున్నా జాతకాన్ని తిరగరాసిందని చెప్పాలి. టాక్ ఎలా ఉన్నా ఏదో భారీ బడ్జెట్ మూవీ కనుక పొలోమని పోతున్నట్టు కనిపిస్తోంది. వీకెండ్, ఫెస్టివల్ కలెక్షన్స్‌తో సాహో సేఫ్ అయిపోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద ప్రొడ్యూసర్స్ సేఫ్. ఇక బయ్యర్లు మాత్రం కొంత ఎడ్జ్‌లో చిన్నపాటి లాస్‌తో గట్టెక్కవచ్చన్న అంచనా ఉంది.
మూవీకి డైరెక్టర్ కమాండింగ్ లోపం, సీన్స్ వారీ కేటాయింపులు, కొరియన్ ఫిల్మ్ కాపీలో ఇంటెలిజన్స్ చూపకపోవడం, లాజిక్ మిస్ కావడం వంటి కారణాలతో ఈ పరిస్థితి దాపురించింది.
టోటల్‌గా ప్రభాస్ యాక్షన్, రిచ్ సీన్స్, ప్రమోషన్ సాహో మూవీ సేఫ్ రేంజ్‌కి రావడానికి హెల్ప్ చేస్తున్నాయి. బిగ్ బడ్జెట్ మూవీస్ ఇకనైనా బెస్ట్ సబిజెక్టుతో తీస్తేనే తగిన ఫలితం ఉంటుందని సాహో ఎగ్జాంపుల్‌గా అందరూ దృష్టిలో పెట్టుకుంటున్నారు.