యంగ్ రెబల్ స్టార్ … డార్లింగ్ ప్రభాస్ సాహో మూవీ వారం కలెక్షన్స్ అఫియల్ రిపోర్ట్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 7 రోజులకు రూ. 370 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మూవీ టీమ్ ప్రకటించింది.
సాహో తొలి రోజు వంద కోట్లు, రెండో రోజు 105 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత 5 రోజులకు 165 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం గమనార్హం. రోజు రోజుకు కలెక్షన్స్ తగ్గడం చూస్తే సాహో అనుకున్నంతగా ఆకట్టుకోలేదన్న విషయం అర్ధం అవుతుంది.
కేరళ, కర్ణాటకలో సాహో ఫర్ ఫార్మెన్స్ అంత బాగా లేదని సమాచారం. హిందీ బెల్ట్ లో కంటెంట్ బాగా లేకున్నా 450 ధియేటరల్లో మంచి క్రేజ్ వచ్చిందని నేషనల్ మీడియా టాక్. స్క్రిప్ట్ పై మరింత ఫోకస్ పెడితే సాహో మంచి హిట్ అయ్యేదని తమిళ్ డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయం. మొత్తం మీద కొన్ని నష్టాలు తప్పవని బయ్యర్ల భయం.