సాహో ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినా ఇంకా సేఫ్ కాదు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఇంకా కలెక్షన్లలో మరో సెంచరీ కొడితేనే షేర్‌లో సేఫ్ అవుతుంది.
సాహో 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ అని మూవీ టీమ్ ప్రకటించినప్పటికీ ఆర్ధికంగా గట్టెక్కడానికి ఇంకా కొన్ని రోజులు ఆశించిన కలెక్షన్లు రావాల్సి ఉంది. ఇప్పటికే థియేటర్లలో సీట్లు పూర్తిగా నిండటం లేదు. కొంత ఖాళీగా ఉంటోంది. స్టడీ కలెక్షన్లు వస్తేనే మరో వంద కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
వెంటనే హిట్ సినిమాలు, పోటీ సినిమాలు లేకపోవడం సాహో కొంత సేఫ్ కావడానికి అనుకూల పరిస్థితి ఏర్పడింది. ఏమైనా మరో వంద కోట్లు కలెక్షన్లు రాకపోతే బయ్యర్లు, నిర్మాత సేఫ్ జోన్‌లోకి వచ్చే అవకాశం లేదు. స్లోగా అయినా సేఫ్ జోన్‌కు వస్తుందో, లేదో వేచి చూడాల్సిందే…!