కాస్ట్‌లీ ఫెయిల్యూర్ కాసేదెవరు! - Tolivelugu

కాస్ట్‌లీ ఫెయిల్యూర్ కాసేదెవరు!

, కాస్ట్‌లీ ఫెయిల్యూర్ కాసేదెవరు!ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ రాబట్టిందని చిత్ర యూనిట్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేసిన ప్రభాస్, హిందీలో 130 కోట్ల నెట్ రాబట్టి లాభాల బాటలో నడుస్తున్నాడు. అదే జోరు మిగిలిన ప్రాంతాల్లో కూడా సాగితే బాగుండేది కానీ, ఆ నార్త్ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాహో పరిస్థితి తలకిందులు అయ్యింది.

, కాస్ట్‌లీ ఫెయిల్యూర్ కాసేదెవరు!సాహో ఏరియా వైజ్ రైట్స్ అండ్ కలెక్షన్స్ ఇవీ !

అన్నిప్రాంతాల్లో కలిపి దాదాపు 350 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన సాహో సినిమా ఇప్పటి వరకూ 130.98 కోట్లకి రాబట్టింది. కేవలం తెలుగులోనే 125 కోట్లు రాబడితేనే బ్రేక్ ఈవెన్ చేరే సాహో ఇప్పటి వరకూ రాబట్టింది కేవలం 80 కోట్ల షేర్ మాత్రమే. అంటే మరో 40 కోట్ల షేర్ రాబడితేనే సాహో సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ చేరే అవకాశం ఉంది.

ఇప్పుడున్న పరిస్థితి, డ్రాప్ అవుతున్న కలెక్షన్స్ రెండూ చూస్తే సాహో కంప్లీట్ రన్‌లో కూడా అంత రాబట్టేలా కనిపించట్లేదు. భారీ అంచనాలతో ఈ సినిమాని కొన్న ప్రతి బయ్యర్స్ అందరికీ కలిపి సాహో సినిమా దాదాపు 60 కోట్ల నష్టాన్ని మిగిలించే ప్రమాదం ఉంది. 60 కోట్లు అంటే ఒక స్టార్ హీరో సినిమా బడ్జట్ అంత.

ఈ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత ఎవరిది? కథని సరిగా రాసుకోలేకపోయిన సుజిత్ తీసుకుంటాడా? బాహుబలి క్రేజ్ వాడుకోవాలని చూసిన యూవీ క్రియేషన్స్ తీసుకుంటుందా? లేక కథపై పట్టు లేకుండా సినిమా చేసేసి, అద్భుతమైన సినిమా చేశాం అందరూ చూసి ఎంజాయ్ చేయండి అని ప్రొమోషన్స్ చేసిన ప్రభాస్ తీసుకుంటాడా?

ఈ నష్టానికి కారణం నిర్లక్ష్యం అనేది అక్షర సత్యం. ఈ నిర్లక్ష్యం కారణంగానే 400 కోట్లు రాబట్టినా కూడా సాహో సినిమా కాస్ట్లీ ఫెయిల్యూర్‌గా మిమిలిపోయింది. ఫ్యూచర్‌లో ఇంత భారీ స్థాయిలో సినిమాలు చేయాలనుకునే వాళ్లు అయినా కథపై ఖర్చు పెడితే, కథకి అవసరమైన దానికి ఖర్చు పెడితే సినిమాని కొనే బయ్యర్లు బ్రతికే పరిస్థితి ఉంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp