ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ … టాప్ రేంజ్ !!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్క్రీన్ ఎంట్రీ 2002లో ‘ఈశ్వర్’తో షూరు అయ్యింది. తొలి మూవీతోనే బెస్ట్ మార్క్స్ కొట్టేశాడు డార్లింగ్. న్యూ ఎంట్రీ.. కానీ, అనుభవం ఉన్న బిగ్ హీరో మాదిరి ఫర్ఫార్మెన్స్ చూపించడంతో ఫాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు. నెక్స్ట్ ఈయర్ 2003లో వచ్చిన రాఘవేంద్ర అంత పెద్ద హిట్ కాకపోయినా.. తెలుగుతెరకు కృష్ణంరాజు మంచి వారసుణ్ణి అందించాడనే టాక్ వచ్చింది. ఇక, ముచ్చటగా మూడో ఏడాది 2004లో వచ్చిన వర్షం మూవీ ప్రభాస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్‌కు పిచ్చ ఫాన్ ఫాలోయింగ్ మొదలైంది ఈ మూవీతోనే.
ఆ తర్వాత 2004లో అడవిరాముడు, 2005లో చక్రం ప్రభాస్ యాక్టింగ్ వైవిధ్యాన్ని చూపాయి. ఆరో మూవీగా 2005లో వచ్చిన ఛత్రపతి సూపర్ హిట్. రాజమౌళి మార్క్ యాక్షన్‌తో ప్రభాస్ అదరగోట్టేసింది. తర్వాత 2006 నుంచి 2008 దాకా ప్రభాస్ కెరీర్ స్టడీగా ఉంది. 2006లో పౌర్ణమి క్లాసిక్ ఇమేజ్, 2007లో యోగి, మున్నా, 2008లో బుజ్జిగాడు మేడిన్ చెన్నై మూవీలు డిఫరెంట్ డైమన్షన్స్ చూపాయి.
2009లో వచ్చిన బిల్లా.. అమ్మాయిలంతా ప్రభాస్ భలే బాగున్నాడే అనేట్టు చేస్తే… ఏక్ నిరంజన్ తనలోని యాక్టింగ్ ఈజ్‌ను తెలియజేసింది. ఇక, ప్రభాస్ పదమూడో, పధ్నాలుగో మూవీలు హిట్ కొట్టేసి టాలీవుడ్‌లో నయా ఇమేజ్ తెచ్చిపెట్టాయి. 2010లో డార్లింగ్ మూవీ యూత్ ఫుల్ సక్సెస్. ఈ మూవీతో ఫాన్స్ అభిమానాన్ని మరింత రెట్టింపు చేసుకున్నాడు ప్రభాస్. దాంతో అందరికీ డార్లింగ్ అయిపోయాడు. తర్వాత 2011లో రిలీజ్ అయిన మిస్టర్ ఫర్ఫెక్ట్ హిట్ ప్రభాస్ సక్సెస్ రేంజ్ గ్రాఫ్ అమాంతం పెంచేసింది. 2012లో రెబల్ డిఫరెంట్ మూవీగా మిగిలింది.
టాప్ రేంజ్ ఇమేజ్ క్రియేట్ చేసిన ఈయర్ 2013. ఈ ఏడాది వచ్చిన మిర్చి సూపర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ కెరీర్ పీక్స్‌కు వెళ్లింది. 2015లో దూసుకొచ్చిన రాజమౌళి బాహుబలి- ది బిగినింగ్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డ్ నెలకొల్పింది. ఇటు టాలివుడ్, అటు బాలీవుడ్‌ను బహుబలి ఆల్ టైం రికార్డుల్లో ముంచేసింది. బాహుబలిగా ప్రభాస్ కెరియర్ ఆకాశానికి ఎగసింది. దీనికి కొనసాగింపుగా 2017లో వచ్చిన రాజమౌళి బాహుబలి- ది కంక్లూజన్ మూవీ హిస్టరీని సృష్టించింది. బాహుబలి ఇమేజ్ ప్రభాస్‌కు సవాల్ గా మారింది. అందుకే రెండేళ్ళు ఎంతో కష్టపడి…ఇష్టపడి చేసిన సాహో మూవీ సరికొత్త రికార్డులకు రెడీ అయింది. 2019 ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా అన్ని రికార్డులు తిరగ రాసేందుకు దూసుకొస్తోంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో నయా ట్రెండ్ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా…ప్రభాస్ అభిమానుల ధీమా. సాహో..ఆహా అనిపిస్తుందన్న సినీ పండితుల మాట అంతటా మార్మోగుతోంది.