కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అటెన్షన్ని గ్రాబ్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలి సినిమాతో తోటినటులంతా జెలస్ ఫీలయ్యేంత ఫ్యాన్ క్రేజ్ కొట్టేసిన ప్యాన్ ఇండియన్ హీరో ప్రభాస్.
సౌత్ ఇండియా సత్తాచాటిన వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సలార్. భారీ బడ్జట్ తో ప్యాన్ వరల్డ్ బిజినెస్ లక్ష్యంగా తెరకెక్కుతోందీ చిత్రం. సలార్ రిలీజ్ అయిన రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమంటున్నారు క్రిటిక్స్.
ఈ నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి సలార్ ఫ్యాన్స్ ను తెగ టెంప్ట్ చేస్తోంది. కెజియఫ్ తర్వాత సలార్ మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి జస్ట్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి, దానికే ప్రభాస్ ఫ్యాన్స్ ని పట్టుకోవడం కష్టమవుతోంటే ఇక టీజర్ రిలీజ్ అయితే ఇప్పటివరకూ ఉన్న డిజిటల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
ప్రస్తుతం సలార్ గురించి సోషల్ మీడియాలో వచ్చే హైప్ మామూలుగా ఉండడం లేదు. గతంలో సలార్ క్లైమాక్స్ గురించి…ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే , ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉంటుందనే టాక్ వినిపించింది.
అందుకు తగ్గట్టే సలార్ క్లైమాక్స్‌ను ఏకంగా 400 మంది రౌడీలతో ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్.ఈ క్లైమాక్స్ సీక్వెన్స్‌లోనే ప్రభాస్ రెండో క్యారెక్టర్‌కి సంబంధించిన ఊహించని ట్విస్ట్ రివీల్ అవుతుందట.ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
అందుకే సలార్ పార్ట్ వన్ క్లైమాక్స్.. సెకండ్ పార్ట్‌కి సాలిడ్ లీడ్ ఇస్తూ.. ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని విధంగా సలార్ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు.
నిజమే కదా..! ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్‌కు ప్రభాస్ లాంటి కటౌట్ దొరికితే.. ఊరుకుంటాడా? స్క్రీన్స్ చిరిగి పోవాల్సిందే. మరి సెప్టెంబర్ 28న రానున్న సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.