యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 14న భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గతంలో కూడా ఇలాంటి ప్రచారం జరిగినప్పటికీ అధికారిక ప్రకటన రాకపోవడంతో అంతా ఫేక్ అని ఫిక్స్ అయ్యారు.
కానీ ఇప్పుడు మరోసారి స లార్ రెండు పార్టు లుగా రాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం రెండు పార్టు లుగా రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ కాబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా సలార్ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. ఇక హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.