రాధేశ్యామ్ సినిమా షూట్ పూర్తి చేసి… కేజీఎఫ్ తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ జతకట్టాడు. సలార్ అంటూ టైటిల్ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది ఈ మూవీ.
సలార్ చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం… ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుండి సినిమా షూట్ స్టార్ట్ కానుంది. నాన్ స్టాప్ గా సినిమా షూట్ జరగనుండగా, సింగిల్ షెడ్యూల్ లో హైదరాబాద్ లోనే షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది సెకండ్ ఆఫ్ లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక సలార్ లో ప్రభాస్ పక్కన దిశా పటానీని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ మూవీ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా చేయాల్సి ఉంది.