జీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్ ‘. ఇది పాన్ ఇండియా సినిమాగా వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న సలార్ అప్‌డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం పలు హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకున్న ప్రదేశంలో సలార్ చిత్రీకరణ కొనసాగుతోంది. ప్రస్తుతం సలార్ షూటింగ్ పురాతన దక్షిణాది ఇటాలియన్ పట్టణమైన మటెర్నాలో జరుగుతోంది.
సలార్‌కు సంబంధించిన తర్వాతి పోర్షన్లను నేపుల్స్, రోమ్, బుడాపెస్ట్ ప్రాంతాల్లో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ రెడీ చేశారని ఇన్‌సైడ్ టాక్. సలార్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతుందని చెప్పడానికి ఈ ఒక్క క్రేజీ న్యూస్ చాలు అంటున్నారు సినీ జనాలు.
కేజీఎఫ్ ప్రాంఛైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్ కిరగందూర్ హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై సలార్ ను తెరకెక్కిస్తుండటంతో ఇప్పుడు రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న సలార్ 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ సలార్ కోసం భారీ ప్రమోషనల్ సిద్దం చేశాడని టాక్. రానున్న రోజుల్లో ప్రమోషన్స్‌లో భాగంగా సలార్ పోస్టర్లు, గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్.. ఇలా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ అభిమానులను ఖుషీ చేసేందుకు రెడీ అవుతోంది ప్రభాస్ టీం.