కరోనా వైరస్ సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. ఓవైపు వేలాది మందిని పొట్టనపెట్టుకుంటూ… ఆర్థికంగానూ దెబ్బతీస్తోన్న కరోనా వైరస్ సినిమా రంగానికి ఓ పీడకలలా మిగిలిపోనుంది. కరోనా వైరస్ దెబ్బకు యాక్షన్, కెమెరా, రోల్ అనే పదాలు ఇప్పటికే మూగబోయాయి. ప్రొడక్షన్ టీమ్స్ అన్నీ ప్యాకప్ చెప్పి ఇంటికి పరిమితం అయిపోయాయి.
అయితే… ప్రభాస్ రాధాక్రిష్ణకుమార్ దర్శకత్వంలో తన 20వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ చేజింగ్ సీన్ కోసం జార్జియా వెళ్లింది చిత్ర యూనిట్. అయితే.. .కరోనా వైరస్ దెబ్బకు మధ్యలోనే ప్యాకప్ చెప్పేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. యాధావిధిగానే ఇండియాలో ల్యాండ్ అవగానే ప్రభాస్‌తో పాటు ఆయన టీంకు కరోనా స్క్రీనింగ్ టెస్ట్‌లు జరిగాయి. నెగెటివ్ రావటంతో… 14 రోజుల పాటు అవసరమైతే తమ నిర్భందంలో ఉండాలి అని వైద్యారోగ్య శాఖ సంతకం చేయించుకొని ఇంటికి పంపేసింది.
అయితే, ఇదే టీంలో మెంబర్‌గా ఉన్న కమెడియన్ ప్రియదర్శికి కూడా నెగెటివ్ వచ్చినప్పటికీ, తనను తాను గృహా నిర్భందం చేసుకున్నాడు. సోషల్ డిస్టెన్సింగ్ వల్ల సమాజానికి మంచిది అని ప్రకటించాడు. మరీ అదే టీంలో మెంబర్‌గా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇప్పుడు సమాజానికి దూరంగా 14 రోజుల పాటు ఉంటాడా…? యంగ్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్‌లు మెసెజ్ ఇచ్చినట్లు తనను తాను స్వీయ నిర్భందం చేసుకొని తన ఫ్యాన్స్‌కు కరోనా మెసెజ్ పంపిస్తాడా…? అన్నది చూడాలి.