బాహుబలిని ఫాలో అవుతున్న ప్రభాస్ ? - Tolivelugu

బాహుబలిని ఫాలో అవుతున్న ప్రభాస్ ?

బాహుబలి సినిమా తర్వాత  పాన్ ఇండియా స్టార్ అయ్యేడు ప్రభాస్.ఆ సినిమా తర్వాత ఆయన సుజీత్ తో  థ్రిల్లర్ డ్రామా సాహో చేశారు. అది ఓ మాదిరి కలెక్షన్స్ సాదించినా,ప్రేక్షకులని మాత్రం నిరాశపరిచింది అనే చెప్పాలి. ఇప్పుడు  ప్రభాస్   జిల్ డైరెక్టర్ రాధా కృష్ణ తో “జాన్” అనే సినిమా చేస్తున్న విషయం అందరకి తెలిసిందే .ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి, ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని వార్త గట్టిగా వినపడుతుంది.
సాహో సినిమా పరాజయం తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమా జాన్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం హీరోయిన్ గా అరవింద సమ్మేత ,మహర్షి వంటి హిట్స్  తో దూసుకుపోతున్న పూజా హెడ్గే  ని తీసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్,ఇప్పటికే 20 డేస్ షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇక నెక్స్ట్  షెడ్యూల్ త్వరలోనే మొదలు అవ్వనుంది.ఈ సినిమా కోసం రామోజీ ఫైల్ సిటీ లో రైల్ సెట్ వేస్తున్నారు.అలాగే,ఈ సినిమా లో ప్రభాస్ ఫార్చ్యూన్ టెల్లర్ గా ,పూజ హెడ్గే టీచర్ గా నటిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమా కోసం బరువు తగ్గనున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఆయన జిమ్ తో పాటు స్ట్రిక్ట్ డైట్ కూడా ఫాలో అవుతున్నారని సమాచారం.
ఈ సినిమా కి అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు,అలాగే మనోజ్ పరమహంస కెమెరాని హేండిల్ చేస్తున్నారు.ఈ సినిమాని యు.వి క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ వారు సంయుక్తం గా నిర్మిస్తున్నారు.
గతంలో తారక్ ఆంధ్రావాలా సినిమాలో తండ్రి ,కొడుకు పాత్రల్లో నటించారు. ఆ సినిమా ప్లాఫ్ అయినా తారక్ నటనకి మంచి గుర్తింపు వచ్చింది.అలాగే ప్రభాస్ కూడా బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి, శివుడు పాత్రలు చేసి అందరని అలరించారు. కానీ ఆ సినిమాలో తండ్రి, కొడుకు మద్య  సీన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ జాన్ సినిమాలో తండ్రి, కొడుకు పాత్రల్లో నటించబోతున్నారని అని టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో తండ్రి పాత్ర లో ప్రభాస్ తెల్లజుట్టు తో కనిపిస్తారని సమాచారం.అలాగే ఈ సినిమాలో తండ్రి, కొడుకు మధ్య వచ్చే  సీన్స్  మేజర్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. ఇక ఈ వార్త లో నిజం ఎంత ఉందొ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Share on facebook
Share on twitter
Share on whatsapp