మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం జాంబి రెడ్డి. ఈ సినిమాలో తేజ సరసన ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కు సంబంధించిన పోస్టర్లను, టీజర్ ను స్టార్ హీరోయిన్ సమంత, నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదగా ఓ స్పెషల్ ఉండబోతుందని ప్రకటించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సర్‌ప్రైజ్ రివీల్ చేస్తుండటంతో అందరి దృష్టినీ ఈ సినిమా ఇప్పుడు ఆకర్షిస్తోంది.