జిల్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధా కృష్ణ తో ప్రభాస్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి వంటి సినిమా తరువాత బారి యాక్షన్ తరహాలో సాహో వంటి సినిమా తీసి నిరసపడ్డ ప్రభాస్ ఇప్పుడు లవ్ స్టోరీ పై పడ్డాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇద్దరి బామలతో రొమాన్స్ చెయ్యటానికి సిద్ధం అయ్యాడని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా మరో హీరోయిన్ గా కాజల్ ని పెట్టాలని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కాజల్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. వింటేజ్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్ గా ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.