బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను అయోధ్య వేదికగా సరయు నది తీరాన గరాండ్ గా విడుదల చేశారు.
అయితే గ్రాండ్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ను చూసిన ఆయన అభిమానులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్‌కు ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ వైట్ అండ్ వైట్ లుక్‌లో బాగానే కనపడ్డారు.
అయితే ఆయన నడవడానికి చాలా ఇబ్బంది పడినట్లు అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో డార్లింగ్ మెట్లు దిగేందుకు దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ సాయం తీసుకున్నారు. వారి చేతులు పట్టుకుని మెట్లు దిగారు.
ఇక ఈ వీడియోలు చూసిన అభిమానులు.. ప్రభాస్‌కు ఏమైంది? అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరా తీస్తున్నారు.కాగా, కొద్ది రోజుల క్రితం రాధేశ్యామ్ విడుదల తర్వాత.. ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారు. కొంతకాలం విరామం తీసుకుని షూటింగ్లలో పాల్గొన్నారు. బహుశ ఆ గాయం మళ్లీ తిరగబెట్టి ఉండవచ్చని.. అందుకే ఆయన నడవడానికి ఇబ్బంది పడ్డారని అభిప్రాయపడుతున్నారు.
Majestic entry of Raghav #Prabhas along with Janaki @kritisanon , @omraut and Bhushan Kumar from the bank of Sarayu river🙏#Adipurush #AdipurushTeaserDay #AdipurushInAyodhya #PrabhasEra #PrabhasGirlsFC pic.twitter.com/wa50ZBkxvl
— PrabhasGirlsFC (@PrabhasGirlsFC) October 2, 2022