కేజీఎఫ్ తో ఆల్ ఇండియా స్టార్ గా మారిన హీరో యష్. సినిమా వెనుకున్నదంతా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయినప్పటికీ యష్ కు స్టార్డమ్ తీసుకొచ్చింది. అయితే, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కన్నా ముందు యష్ కు మరో కథ చెప్పాడట. ఆ తర్వాతే కేజీఎఫ్ స్టోరీ చెప్పి… రెండింటిలో ఒకటి పిక్ చేసుకోమనటంతో యష్ కేజీఎఫ్ వైపు మొగ్గుచూపాడని తెలుస్తోంది.
యష్ నో చెప్పిన కథే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ అని ఇండస్ట్రీ టాక్. నిజానికి కేజీఎఫ్ కథ కూడా ప్రభాస్ కు సూపర్ గా ఉండేదని ప్రభాస్ ఫాన్స్ అభిప్రాయం. ఇప్పుడు సలార్ కూడా అదే కోవకు చెందినదని… భారీ హిట్ పక్కా అంటూ ప్రభాస్ అభిమానులు ఖుషీ మీద ఉన్నారు.
ఇప్పటికే సలార్ షూట్ మొదలుకాగా… 2022లో రిలీజ్ కానుంది. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా… యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్-2 విడుదలకు ముస్తాబవుతుంది.