యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… బాలీవుడ్ బ్యూటీ దిశ పటానీతో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధేశ్యామ్ షూట్ లో ఉన్న ప్రభాస్ వచ్చే జనవరి నుండి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో జతకట్టనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సలార్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సలార్ సినిమాలో ప్రభాస్ సరసన దిశ పటానీని ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ సాగుతుంది. దిశ కూడా బాలీవుడ్ లో పలు పెద్ద సినిమాలు చేస్తున్నప్పటికీ, సౌత్ లో ఇంతవరకు సినిమా ఒప్పుకోలేదు.
ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో షూట్ ప్రారంభించి… దీపావళికి రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేజీఎఫ్ నిర్మించిన హోమబుల్ ఫిల్మ్స్ నిర్మించనుంది.