ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు కలిస్తే ఎప్పుడూ సంచలనమే. అలా ప్రభాస్-యష్ ఆల్రెడీ ఒకసారి కలిశారు. సలార్ ఓపెనింగ్ కు యష్ వచ్చాడు. మెయిన్ ఎట్రాక్షన్ అయ్యాడు. ఆ టైమ్ లో ప్రభాస్-యష్.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలిశారు.
కేజీఎఫ్-2తో పాన్ ఇండియా స్టార్ అయిన యశ్.. తాజాగా ప్రశాంత్ నీల్ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే తన దర్శకుడి కోసం ప్రభాస్ కూడా బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు.
కేవలం నీల్ కోసం.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాడు ప్రభాస్. ఈ సందర్భంగా ప్రభాస్-యష్ మరోసారి కలుసుకున్నారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు, ఆసక్తికరమైన చర్చకు కూడా దారితీశాయి.
బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్ తో యష్.. పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. ఇప్పుడీ ఇద్దర్నీ పెట్టి ఓ మల్టీస్టారర్ చేయాలంటూ ప్రశాంత్ నీల్ ను డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే, మల్టీస్టారర్ ప్లాన్ చేయమని కోరుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నీల్ కు ఇవి కనిపించే ఉంటాయి.