కొన్ని సినిమాలు స్టార్ హీరోలకు మంచి హిట్ ఇస్తే మరికొందరికి చేదు జ్ఞాపకాలు ఇస్తాయి. మంచి కథలను వద్దు అనుకుంటారు కొందరు స్టార్ హీరోలు. ఇలా వేరే వాళ్లకు వెళ్లి సూపర్ హిట్ లు అవుతూ ఉంటాయి. ఇలా కొన్ని సినిమాలను వదులుకున్న స్టార్ హీరోలు ఇప్పటికీ బాధ పడుతూ ఉంటారు. అతడు సినిమాను పవన్ కళ్యాణ్ వదులుకున్నారు. అలాగే పోకిరి సినిమా కూడా ఆయన వదులుకున్న సంగతి తెలిసిందే.
ఇక ప్రభాస్ కూడా చాలా సినిమాలు వదులుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఆయన వదులుకున్న సూపర్ హిట్ సినిమా ఆంధ్రుడు. ఈ సినిమా గోపిచంద్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా దర్శకుడు పరుచూరి మురళి అసలు కథ రాసుకుంది ప్రభాస్ కోసం. కాని ప్రభాస్ మాత్రం తనకు కథ సెట్ కాదని కెరీర్ మొదట్లో వద్దు అనుకున్నారు. ఇక పరుచూరి మురళి మరో ఆలోచన లేకుండా మరో హీరో దగ్గరకు వెళ్ళారు.
వాస్తవానికి ఆ కథ ప్రభాస్ వద్దు అనుకుంటే అదే హైట్ తో ఉండే గోపిచంద్ కి చెప్పాలి అనుకున్నారట. గోపిచంద్ దగ్గరకు వెళ్లి కథ చెప్పగానే ఆయన మరో ఆలోచన లేకుండా ఓకే అన్నారట. ఇక ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ కు కొన్ని సినిమాలు షాక్ ఇచ్చాయి. అప్పట్లో ఈ సినిమా ప్రభాస్ చేసి ఉంటే కెరీర్ కు బాగా ప్లస్ అయ్యేది అని అంటూ ఉంటారు.