నీలి నీలి ఆకాశం పాటతో ప్రదీప్ సినిమాకు కావాల్సినంత బజ్ వచ్చేసింది. హీరోగా తన లక్ పరీక్షించుకుంటున్న ప్రదీప్ మూవీ ఎలా ఉందంటే…
బ్రిటీష్ కాలం నాటి ప్రేమ కథలో 90రూపాయల సంపాదించేందుకు కుస్తీ పోటీలకు వెళ్లటం, ఆ డబ్బుతో అమ్మాయి గారికి చీర నేసి ఇచ్చేందుకు ప్రయత్నించటం, కానీ ఆ 90 రూపాయల పోటీ ఎక్కువా… నేను ఎక్కువా అంటూ పోటీయే ఎక్కువ అంటూ చెప్పేస్తాడు. దీంతో తను ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. తను మరణించదని తెలియగానే పోటీలో అబ్బాయి గారూ కూడా దెబ్బలు తిని మరణిస్తాడు.
కట్ చేస్తే ఈ ఇద్దరు మరు జన్మలో వైజాగ్ కాలేజీలో కలుస్తారు. వీరిని గత జన్మ జ్ఞాపకాలు ఎలా వెంటాడుతాయి అన్నదే సినిమా.
సినిమాకు మ్యూజిక్ మంచి అండగా ఉంది. నీలి నీలి ఆకాశంతో పాటు మరో రెండు పాటలు అద్భుతంగా ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అనూప్ అబ్బురపరిచాడు. ప్రదీప్ కూడా డిఫరెంట్ షెడ్స్ లో మెప్పించగా… కామెడీలో వాహ్ అనిపిస్తాడు.
కానీ డైరెక్టర్ మున్నా కథను మల్చటంలో తడబడ్డాడు అనిపిస్తుంది. సీన్ టూ సీన్ కనెక్టింగ్ ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సీన్స్ మాత్రం బాగా తీయగలిగాడు. ఇక సినిమా మొదట్లో కాస్త మిస్సయినా ఇక అర్థంకానట్లుగా ఉంటుంది. ప్రేక్షకులను కథలో ఇన్వాల్స్ చేయలేదేమో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ కావాలని జోప్పించినట్లుగా ఉంటాయి.
ఓవరాల్ గా యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు.