నూతన దర్శకుడు మున్నా దర్శకత్వంలో ప్రదీప్ మాచిరాజు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? ఈ సినిమాలో ప్రదీప్ మాచిరాజు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆలస్యం అయింది. కాగా ఇటీవల జనవరి 29న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అయితే రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్టార్ట్ చేసింది. అందులో భాగంగా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతుండగా దర్శకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అందరూ కూడా షాక్ కు గురి అయ్యారు. కొద్ది సమయం తర్వాత మున్నా కోలుకున్నారు. లోబిపి కారణంగానే మున్నా కింద పడిపోయినట్లు సమాచారం.